తెలంగాణ

telangana

ETV Bharat / state

భౌతిక దూరం పాటించేలా చూడండి : సిక్తా పట్నాయక్ - peddapalli collector sikta patnaik review

ఎన్టీపీసీలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్​ ప్రాజెక్టులో సుమారు 4,500 మంది వలస కార్మికులు పని చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వారు వైరస్​ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

peddapalli collector sikta patnaik review on power project
పెద్దపల్లిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్

By

Published : May 4, 2020, 12:33 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో వలస కార్మికులు, విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై ఉన్నతాధికారులతో కలెక్టర్​ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. ఎన్టీపీసీలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ​అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు జరిగేటప్పుడు కార్మికులంతా భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, రామగుండం ఎన్టీపీసీ ఈడి రాజకుమార్, పోలీస్ కమిషనర్ డీఐజీ సత్యనారాయణ, జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి నరసింహమూర్తి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details