తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాను వీడతానన్న వార్తలు అవాస్తవం: సోమారపు - తెలంగాణ తాజా వార్తలు

పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను పెద్దపల్లి జిల్లా భాజపా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఖండించారు. కేసీఆర్ ఇంకో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

peddapalli bjp president somarapu sathyanarayana clarity on party change
భాజపాను వీడతానన్న వార్తలు అవాస్తవం: సోమారపు

By

Published : Feb 8, 2021, 9:49 PM IST

పార్టీ మారుతున్నట్టు పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పెద్దపల్లి జిల్లా భాజపా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాను భాజపా జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని అన్నట్టు తెలిపారు. అంతే కానీ పార్టీ వీడతానని ఎక్కడ అనలేదని పేర్కొన్నారు. భాజపా క్రమశిక్షణ గల పార్టీ అని... అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా... కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

ఆదివారం నాడు సూర్యాపేట జిల్లాలో గిరిజనులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సత్యనారాయణ తెలిపారు. పోలీసులను ప్రైవేటు సైన్యంలాగా వాడుకుంటూ... దాడులు చేయడం సరికాదన్నారు. కేసీఆర్​ ఇంకా పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కొడుకును సీఎంను చేస్తారన్న ప్రచారంతో తెరాసలో లుకలుకలు మొదలయ్యాయని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:భాజపాతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: బండి

ABOUT THE AUTHOR

...view details