దిల్లీలో 23 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. కేంద్రంలో చలనం లేదని పెద్దపల్లి జిల్లాలోని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. అన్నదాతల నిరసనకు మద్దతుగా.. మంథని చౌరస్తాలో అఖిలపక్షం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టింది. టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నేతలు తక్షణమే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'చట్టం అమలైతే రైతులు కూలీలే' - అఖిలపక్షం నిరసన దీక్ష
నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్దపల్లి జిల్లాలో అఖిలపక్షం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టింది. చట్టం అమలైతే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయే ప్రమాదముందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
'చట్టం అమలైతే రైతులు కూలీలే'
చట్టం అమలైతే రైతులు కూలీలుగా మారిపోతారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలున్నాయని అన్నారు. కార్పొరేట్ శక్తులు సిండికేట్‌లా మారి.. రైతుకు గిట్టుబాటు ధర లేకుండా చేసే ప్రమాదముందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి'