తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2020, 7:33 PM IST

ETV Bharat / state

యువత అత్యున్నతస్థాయికి ఎదగాలి: అదనపు కలెక్టర్​

యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

peddapalli additional collector visit mother teresa college
యువత జీవితంలో ఎదగాలి: అదనపు కలెక్టర్​

యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జీవితంలో ఎదగాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని మదర్ థెరెసా ఇంజినీరింగ్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మైనింగ్​ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్​ సాధించి గవర్నర్ తమిళిసై, జేఎన్​టీయూ వైస్ ఛాన్సిలర్ జయేశ్​ రంజన్ చేతుల మీదుగా గోల్డ్​ మెడల్​ అందుకున్న సాకారపు సాయిని ఆయన అభినందించారు.

1999లో కళాశాల స్థాపించిన నాటి నుంచి వినూత్నమైన కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు కాలేజీ నిర్వాహకులు అదనపు కలెక్టర్​కు వివరించారు. 2020 విద్యా సంవత్సరంలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులకు ఎ.ఐ.సి.టి.ఈ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జేఎన్​టీయూ అనుమతులు పొంది ఎంసెట్​ కౌన్సిలింగ్​లో ఉంచినట్లు తెలపగా.. అదనపు కలెక్టర్ సదరు కోర్సులను ఆవిష్కరించారు.

ఇదీ చూడండి.. నిర్మల్​ను క్లీన్ సిటీగా మార్చేస్తాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details