పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్ వద్ద పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 360 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో రెండు వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తుండగా... స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత - acp
అక్రమంగా తరలిస్తున్న 360 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత