తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 570 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. రూ.15 లక్షల విలువైన 570 క్వింటాళ్ల బియ్యంతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

pds rice seize in peddapally and manchiryal
pds rice seize in peddapally and manchiryal

By

Published : Jul 22, 2020, 10:51 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పెద్దపెల్లి జిల్లాలోని బసంత్ నగర్, పొత్కపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల్లో 450 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు రెండు వాహనాలు సీజ్ చేశారు. నలుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ అశోక్​కుమార్​ తెలిపారు.

మంచిర్యాల జిల్లా దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్​లో అక్రమంగా నిలువ ఉంచిన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు శ్రవణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్

ABOUT THE AUTHOR

...view details