సమ్మె ఎఫెక్ట్: ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు - ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పండుగ కోసం ఎలాగో కష్టపడి ఊరు చేరుకున్న పెద్దపల్లి జిల్లా వాసులకు అక్కడ నుంచి గమ్యస్థానాలకు తిరిగి వెళ్లడానికి సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు.
![సమ్మె ఎఫెక్ట్: ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4707262-thumbnail-3x2-vysh.jpg)
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకునే వారే కరువయ్యారు. దసరా పండుగకు ఎలాగోలా కష్టాలు పడి స్వగ్రామాలకు చేరుకున్నారు. కానీ పెద్దపల్లి జిల్లా మంథని డిపో నుంచి ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాలకు అధికారులు బస్సులు నడపకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేసినా అధిక సంఖ్యలో బస్సులు లేకపోవడం వల్ల నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు బస్సులపై సరైన అవగాహన లేక.. ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు.