Parents Protest: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జ్యోతిరావు పూలే బాలికల వసతిగృహం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రాత్రివేళల్లో బాలికల వసతిగృహంలో ఆకతాయిలు చొరబడి అల్లరి చేస్తున్నారని వారు ఆరోపించారు. బాలికలు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థులను వసతి గృహం నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయారు.
Parents Protest: బాలికల వసతిగృహంలో ఆకతాయిల అల్లరి - గోదావరి ఖని వార్తలు
Parents Protest: ఆకతాయిలు వసతి గృహంలో చొరబడి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన గోదావరిఖనిలోని జ్యోతిరావు పూలే బాలికల వసతిగృహంలో చోటు చేసుకుంది. వసతిగృహం వద్ద భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేశారు.
బాలికల వసతిగృహం
పోలీసులు వసతిగృహం వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తామని భరోసా కల్పించారు. తక్షణమే వసతిగృహంలో సీసీ కెమెరాలు, కంచె ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Last Updated : Dec 20, 2021, 11:42 AM IST