తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో తోడుగా ఉంటానని పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి హామీ ఇచ్చారు. కరోనా వేళ వారికి సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పుట్నూరు, జయ్యారం గ్రామాల్లోని కరోనా బాధితులకు రోగనిరోధక శక్తిని పెంచే డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు.
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన జడ్పీటీసీ - తెలంగాణ వార్తలు
తనను గెలిపించిన ఓటర్లకు కరోనా వేళ సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి. కరోనా సోకి ఇళ్లలో ఉంటున్న బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సమయంలో మానసికంగా ధైర్యంగా ఉండాలని సూచించారు.
కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి
హోం ఐసోలేషన్లో ఉంటున్న కొవిడ్ బాధితులకు మనో ధైర్యం నింపి... వైరస్ పట్ల తగు సూచనలు చేశారు. కరోనా బాధితులకు మానసికంగా తోడుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద విష్ణు గౌడ్, వెంకటేష్, శంకర్, శ్రావణ్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గర్భిణీలు, వికలాంగులకు వర్క్ ఫ్రమ్ హోమ్: కేంద్రం