నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు పెద్దపల్లి జిల్లా మంథనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన అందించేందుకు వ్యవస్థలోని లోపాలను తొలగిస్తూ అభివృద్ధి పథంలో ముందుకుపోయేలా చట్టాన్ని రూపొందించారని.. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న కృషిని మధు కొనియాడారు.
రెవెన్యూ చట్టం హర్షణీయం... కేసీఆర్కు పాలాభిషేకం - trs leaders happy on implementation of new revenue act
పెద్దపల్లి జిల్లా మంథనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు వారందరూ హర్షం వ్యక్తం చేశారు.
నూతన రెవెన్యూ చట్టం ద్వారా అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రవేశపెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రతి భూమిని సర్వే చేసి ప్రభుత్వం హద్దులు ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు లేకుండా చేస్తుందని తెలిపారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం రైతులకు మేలు జరుగుతోందని మరోసారి మంథని నియోజకవర్గంలోని రైతులందరితో కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.