తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష నేతల ధర్నా - opposition parties protest at peddapalli

పెద్దపల్లి జిల్లా రైల్వేస్టేషన్ ఎదుట వామపక్షాల నేతలు ధర్నాకు దిగారు. రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

opposition parties protest at peddapalli against railway privatization
రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష నేతల ధర్నా

By

Published : Jul 17, 2020, 2:39 PM IST

రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దపల్లిలో వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రైల్వేస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రైల్వే రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తోందని వామపక్షాల నేతలు ఆరోపించారు.

109 రైళ్లను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. రైళ్లను ప్రైవేటుపరం చేస్తే ఇప్పటివరకు ఉన్న రైల్వే ఛార్జీలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగే అవకాశముందని తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details