తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యవసరాల అనుమతులకు ఆన్​లైన్​లో పాసులు - LOCK DOWN EFFECTS

లాక్​డౌన్​ కొనసాగుతున్న దృష్ట్యా ప్రజల అత్యవసరాలు తీర్చుకునేందుకు ఆన్​లైన్​లో పాసులు జారీ చేసేందుకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పోలీసులు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్​ వెబ్​సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ONLINE PASSES ISSUING IN RAMAGUNDAM COMMISSIONARATE
అత్యవసరాల అనుమతులకు ఆన్​లైన్​లో పాసులు

By

Published : May 3, 2020, 2:50 PM IST

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో లాక్​డౌన్ నిబంధనలు కొనసాగుతున్న దృష్ట్యా... అత్యవసరాలను అధిగమించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేస్తామని సీపీ వి.సత్యనారాయణ తెలిపారు.

ప్రజలు అత్యవసర పరిస్థితులకు అవసరమైన పాసుల కోసం https://tsp.koopid.ai/epass (తెలంగాణ పోలీస్ వెబ్​సైట్), https://www.tspolice.gov.in/, రామగుండం పోలీస్ కమీషనరేట్ వెబ్​సైట్ http://ramagundampolice.in/ ను ఉపయోగించి అవసరమైన వ్యక్తిగత ఐడిలతో దరఖాస్తు చేసుకోవచ్చని సీపీ తెలిపారు. దరఖాస్తు పరిశీలించి ఆన్‌లైన్‌ ద్వారా పాస్‌లను జారీ చేయడం లేదా తిరస్కరించడం జరుగుతుందన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:దేశంలో కరోనా వైరస్​ రూపాంతరం చెందుతోందా?

ABOUT THE AUTHOR

...view details