పెద్దపల్లి జిల్లా మంథనిలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని రావుల చెరువు కట్ట వద్ద రహదారిపై ఊరుగొండ రమేష్(38) అనే వ్యక్తిపై 4 వీధి కుక్కలు దాడి చేశాయి. ఆయనను 15 మీటర్ల దూరం లాక్కెళ్లి... ముఖం, శరీరంపై కొరికి తీవ్రంగా గాయపరిచాయి.
వీధి కుక్కల దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు
పెద్దపల్లి జిల్లా మంథనిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ... స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా పట్టణంలో 4 కుక్కలు దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని స్థానికులు మంథని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వీధి కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు
కుక్కలు దాడి చేసిన సమయంలో అటువైపు ఎవరూ లేకపోవడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఆయన అరుపులు విని వెంటనే స్థానికులు ఇళ్ల నుంచి బయటికి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. గాయపడిన రమేశ్‌ను మంథని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో అక్కడే చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: మలక్‌పేట-నల్గొండ చౌరస్తాలో ప్రజా సంఘాల ధర్నా