పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు ఎస్.బి.ఐ బ్యాంకు దొంగతనం కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 99 గ్రాముల బంగారం, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మార్చి 24న రాత్రి గుంజపడుగు ఎస్.బి.ఐ. బ్యాంకు నుంచి సుమారు 6 కిలోల బంగారు ఆభరణాలు, 18 లక్షల నగదు దొంగిలించారు.
Robbery in SBI Bank: ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో మరో దొంగ అరెస్టు
గుంజపడుగు ఎస్.బి.ఐ బ్యాంకులో జరిగిన దొంగతనం మరో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పట్టుకొని వారి నుంచి సుమారు 3.2 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. ఈ రికవరీ సొత్తును మంథని కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. నిందితుడిని గుంజపడుగు ఎస్.బి.ఐకు తీసుకొని వెళ్ళి“సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. అనంతరం కోర్టు ముందు హాజరు పరిచి 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపినట్లు రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి :భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష