తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకరోజు పోలీస్ కమిషనర్ సాదిక్ క్యాన్సర్​తో మృతి - one day police commissioner died

క్యాన్సర్​తో పోరాడుతూ ఒక రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్​గా పనిచేసిన సాదిఖ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీస్ కమిషనర్ కావాలన్న కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్​కు తెలిపి... 2014 అక్టోబర్ 16న సాదిఖ్ సీపీగా విధులు నిర్వర్తించాడు.

one-day-police-commissioner-sadik-died-with-cancer-at-peddapalli
ఒకరోజు పోలీస్ కమీషనర్ సాదిక్ క్యాన్సర్​తో మృతి

By

Published : Apr 16, 2021, 10:23 AM IST

పెద్దపల్లికి చెందిన జావిద్ పాషా, సాజిదా సుల్తానా రేకుర్తిలో స్థిరపడ్డారు. 2004 ఏప్రిల్ 4వ తేదీన సాదిఖ్ జన్మించాడు. చిన్ననాటి నుంచి సాదిఖ్ చురుగ్గా ఉండటంతో దంపతులు సంబరపడిపోయారు. కానీ 2014లో సాదిఖ్ అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్ నాల్గో స్టేజిలో ఉన్నట్లు గుర్తించారు.

కేవలం వారం రోజులే బతికే అవకాశం ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ బాధ్యురాలు పుష్ప సాదిఖ్​ను కలిశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కావాలన్న తన కోరికను సాదిఖ్ తెలిపాడు. ఈ కోరికను అప్పటి హైదరాబాద్​ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అంగీకరించారు. 2014అక్టోబర్ 16న సాదిఖ్ ఒకరోజు కమిషనర్​గా చేశారు. ఇన్ని రోజులు ఆరోగ్యంగానే ఉన్న సాధిఖ్ నెలరోజులుగా బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతూ గురువారం సాయంత్రం చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి:వృద్ధ దంపతులు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details