పూలమాలలు వేసి ఎన్టీఆర్కు నివాళి - celebrations
ఎన్టీఆర్ జయంతిని పెద్దపల్లి జిల్లాలో తెదేపా కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూమాలలు వేసి, కేకు కట్ చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ కార్యాలయంలో ఫోటోకు పూల మాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ వెల్లడించారు. 2 కిలోల బియ్యం, గృహనిర్మాణ పథకాలు, పింఛన్లు మొదలగు పథకాలు ఆయన ప్రారంభించినవేనని గుర్తుచేశారు.