పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎన్టీపీసీ ఈడీసీ బిల్డింగ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సీజీఎంఋ సునీల్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొని జెండా ఆవిష్కరించి కేక్‌కట్ చేశారు. వేడుకల్లో భాగంగా సంస్థ ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు సీజీయం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. 42 సంవత్సరలుగా ఉద్యోగుల సమష్టి కృషితో ఎన్టీపీసీ ఎన్నో అవార్డులను అందుకున్నట్లు సునీల్ కుమార్ తెలిపారు.
రామగుండంలో ఘనంగా ఎన్టీపీసీ 43వ ఆవిర్భావ వేడుకలు - ఎన్టీపీసీ 43వ ఆవిర్భావ వేడుకలు తాజా వార్త
ఎన్టీపీసీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా నిర్వహించారు. నిరుపేదకు కుటుంబాలకు ఎన్టీపీసీ ఎల్లవేళలా చేయందిస్తుందని సీజీఎం సునీల్ కుమార్ తెలిపారు.
రామగుండంలో ఘనంగా ఎన్టీపీసీ 43వ ఆవిర్భావ వేడుకలు
అలాగే రామగుండం ఎన్టీపీసీ సామాజిక బాధ్యత కింద ప్రభావిత గ్రామాల అభివృద్ధితో పాటు నిరుపేద విద్యార్థులకు ఆన్లైన్ విద్యతో పాటు పుస్తకాలు, సైకిళ్లను అందించిందని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని, కరోనా జాగ్రత్తలు తీసుకొని ప్లాంట్ నిర్మాణపనులు అతి త్వరలో పూర్తి చేస్తున్నారు. హరితహారంలో భాగంగా అటవీశాఖ సహకారంతో మియవాకి ప్రాజెక్ట్ ద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు తెలిపారు.
Last Updated : Nov 17, 2020, 1:59 AM IST