పెద్దపల్లి జిల్లాలోని 13 జడ్పీటీసీ, 138 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దేవసేన పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు 263 ప్రదేశాలను గుర్తించి 744 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో రెండు దశల్లో నిర్వహించనున్న ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలని కోరారు.
సోమవారం ఉదయం నుంచే నామినేషన్ల స్వీకరణ - MPP OFFICE
పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ దేవసేన తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు.
ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలి : కలెక్టర్