పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో నామపత్రాల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడం వల్ల నేడు పెద్ద ఎత్తున ఆశావహులు తరలివచ్చారు. నిన్నటి వరకు 38 మంది నామపత్రాలు దాఖలయ్యాయి. ఈరోజు 20 మంది అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించారు.
మంథని మున్సిపాలిటీలో ముగిసిన నామినేషన్ ప్రక్రియ
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడం వల్ల పెద్దపల్లి జిల్లా మంథని పురపాలికలో పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి.
మంథని మున్సిపాలిటీలో ముగిసిన నామినేషన్ ప్రక్రియ
నామపత్రాల దాఖలు ప్రక్రియ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇవీ చూడండి: మున్సిపాలిటీల్లో 'హస్త'వాసి పనిచేసేనా..?