తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రానివ్వం' - పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు వార్తలు

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని పలు మండలాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ప్రారంభించారు.

'వరి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రానివ్వం'
'వరి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రానివ్వం'

By

Published : Nov 11, 2020, 4:07 PM IST

వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులతో మాట్లాడి అన్ని చర్యలు తీసుకున్నామని పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తెలిపారు. మంథని నియోజకవర్గంలోని మంథని, రామగిరి, కమాన్పూర్, పాలకుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత జిల్లాలోని లారీ అసోసియేషన్ లతో మాట్లాడి రవాణాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ధరణి సేవలు.. అడ్డుగా ఏజెన్సీ చట్టాలు..

ABOUT THE AUTHOR

...view details