రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న కొత్త విద్యుత్కేంద్రం నుంచి వెలువడే బూడిదతో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని నింపేందుకు కొత్త విధానం అమలు చేస్తామని ఎన్టీపీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 2 ప్లాంట్లను ఎన్టీపీసీ నిర్మిస్తోంది.
ఓపెన్‌కాస్ట్ గని పూడ్చివేతకు కొత్త విధానం
ఓపెన్‌కాస్ట్ గని పూడ్చివేతకు కొత్త విధానం అమలు చేస్తామని ఎన్టీపీసీ స్పష్టం చేసింది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 2 ప్లాంట్లను రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తోంది.
ఓపెన్‌కాస్ట్ గని పూడ్చివేతకు కొత్త విధానం
ఈ కేంద్రం నుంచి అధికస్థాయి బూడిద వినియోగం (హెచ్సీఎస్డీ) విధానంలో గొట్టాల ద్వారా నేరుగా మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలోకి బూడిదను పంపుతారు. ఇందుకోసం మల్కాపూర్‌లో గొట్టపుమార్గం నిర్మించినట్లు తెలిపింది. సాధారణ పద్ధతిలో బూడిదను తరలించేందుకు ఉపయోగించే నీటిలో 20శాతమే వినియోగించడం హెచ్సీఎస్డీ విధానమని ఎన్టీపీసీ తెలిపింది.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్