తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి యాజమాన్యంతో చర్చలు విఫలం.... ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత... - సింగరేణి తాజా వార్తలు

Singareni news: బొగ్గు గని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులతో సహా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పరిస్థతి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

Tension at Singareni Hospital
సింగరేణి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

By

Published : Mar 9, 2022, 6:09 PM IST

Singareni news: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి లాంగ్వాల్ ప్రాజెక్టు గని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని.. కార్మిక సంఘాలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం

ఆందోళనకు దిగిన కార్మిక సంఘాలు..

కార్మిక సంఘాలు బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్ అంగీకరించకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు కార్మిక సంఘాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మార్చురీ వద్ద శ్రీకాంత్ మృతదేహాన్ని బొగ్గు గని వద్దకు తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు, కుటుంబ సభ్యులకు వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇదీ చదవండి:సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు బలి.. మృతదేహాలు వెలికితీత

ABOUT THE AUTHOR

...view details