తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ - fake seeds

రైతులకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను రామగుండం కమిషనర్ సత్యనారాయణ అరెస్టు చేశారు.

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

By

Published : Jun 30, 2019, 5:28 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్న ముఠాను స్పెషల్‌ బ్రాంచ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రా, తెలంగాణకు చెందిన కొంతమంది వ్యక్తులు గుంటూరు, ప్రకాశం ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు తయారు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కన్నెపల్లి, భీమారం, మందమర్రి మండలాల్లో అక్రమ నిల్వలపై దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ వెల్లడించారు.

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details