తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటి శుభ్రతకు.. ప్రతి ఆదివారం 10 నిమిషాలు' - మంథనిలో మున్సిపల్ ఛైర్ పర్సన్ శైలజ

మంత్రి కేటీఆర్ సూచన మేరకు.. మున్సిపల్ ఛైర్ పర్సన్ శైలజ మంథనిలోని తన ఇంట్లో నీటినిల్వ లేకుండా పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు శుభ్రతకు కేటాయించాలని తన సిబ్బందికి సూచించారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు.

municipal-chairperson-shylaja-manthani-cleaned-up-the-surroundings-at-his-house
'ఇంటి శుభ్రతకు.. ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాలు'

By

Published : May 31, 2020, 9:54 PM IST

సీజనల్‌ వ్యాధులు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ శైలజ అన్నారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు.. మంథనిలోని తన ఇంట్లో నిల్వనీరు లేకుండా పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు పరిశుభ్రతకు కేటాయించాలని కోరారు.

ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించడం వల్ల.. దోమల నివారణకు ఫాగింగ్‌ క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను శైలజ ఆదేశించారు. ఇంటి పరిసరాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూలర్లు, టైర్లలో మురికి నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. స్వీయ రక్షణ పాటించాలని ప్రజలను కోరారు.

ఇదీ చూడండి:మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details