తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా - lockdown

పెద్దపల్లి పురపాలక కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న మున్సిపల్​ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించాలని కోరారు.

muncipal workers protest in peddapalli district
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా

By

Published : May 14, 2020, 8:23 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి పురపాలక కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కరోనా వైరస్ నివారణలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పురపాలక అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి: 'వలస కూలీలకు నువ్వు అన్నం పెట్టినవా'

ABOUT THE AUTHOR

...view details