పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బుధవారం పేట గ్రామ శివారులో గల గుట్ట ప్రాంతంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, ఎంపీడీఓ విజయకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ - mpp visit manrega works at ramagiri mandal
పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని బుధవారం పేట గ్రామ శివారులో ఎంపీపీ దేవక్క ఆకస్మిక పర్యటన చేపట్టారు. అనంతరం గుట్ట ప్రాంతంలో నిర్వహిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
గుడిమెట్టులోని పని స్థలంలో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తెలియజేయాలని సూచించారు. నిర్దేశించిన మేరకు పనులు చేస్తే ప్రతి ఒక్కరికి మెరుగైన కూలీ వస్తుందన్నారు. ఎండలు అధికమవుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్, ఏపీఓ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ కిరణ్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'నదికి కొత్త నడక నేర్పిన ఘట్టం గజ్వేల్లో ఆవిష్కృతం కానుంది'