పెద్దపల్లి జిల్లా మూలసాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ఆ గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి మందల సరోజన భర్త రామ్‌రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కేంద్రం వద్ద ఓటర్లకు నగదు పంచడాన్ని గ్రహించిన పోలీసులు రామ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 35,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం వల్ల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచిన అభ్యర్థి - mptc husband
ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు డబ్బు పంచుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాడో అభ్యర్థి భర్త. పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామంలో నగదు పంపిణీ చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచిన అభ్యర్థి
పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచిన అభ్యర్థి
ఇదీ చూడండి : రంగారెడ్డి జిల్లా నందిగామలో పోలీసుల దుశ్చర్య