ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు సందె గంగయ్యకు గ్రామస్థులు నివాళులు అర్పించారు. ఆయన స్వగ్రామమైన పెద్దపెల్లి జిల్లా గుంపులకు చేరింది. 21 ఏళ్ల తర్వాత కొడుకును విగతజీవిగా చూసిన ఆయన తల్లి అమృతమ్మ బోరున విలపించారు. గంగయ్య చివరి చూపు కోసం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు తరలివచ్చారు.
గంగయ్యకు గ్రామస్థుల నివాళులు.. అంత్యక్రియలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - తెలంగాణ వార్తలు
విశాఖ ఎన్కౌంటర్లో మరణించిన గంగయ్య మృతదేహం ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంపులకు చేరింది. 21 ఏళ్ల తర్వాత కొడుకు ఇలా చూసిన తల్లి అమృతమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన చివరి చూపు కోసం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు తరలివచ్చారు.
![గంగయ్యకు గ్రామస్థుల నివాళులు.. అంత్యక్రియలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు moist gangaiah, vishaka encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:55:43:1624083943-tg-krn-41-19-entikimaavogangaiahdeadbody-vis-ts10038-19062021114451-1906f-1624083291-181.jpg)
మావోయిస్టు గంగయ్య, విశాఖ ఎన్కౌంటర్
గంగయ్యకు స్థానిక వామపక్ష నేతలు నివాళులు అర్పించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య