తెలంగాణ

telangana

ETV Bharat / state

జైపాల్​రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్​బాబు - జైపాల్​రెడ్డి ఇకలేరు

పెద్దపల్లి జిల్లాలోని తన నివాసంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డికి మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

జైపాల్​రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్​బాబు

By

Published : Jul 28, 2019, 5:42 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని తన నివాసంలో కేంద్ర మాజీమంత్రి జైపాల్​రెడ్డికి ఎమ్మెల్యే శ్రీధర్​బాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జైపాల్​రెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రసార భారతి, ఆల్​ ఇండియా రేడియో ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. లోక్​సభ, రాజ్యసభ టీవీలను ఏర్పాటు చేయించిన ఘనత జైపాల్​రెడ్డికే దక్కుతుందన్నారు.

జైపాల్​రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్​బాబు
ఇవీ చూడండి: జైపాల్​రెడ్డి భౌతికకాయానికి కేసీఆర్​ నివాళులు

ABOUT THE AUTHOR

...view details