పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ టెస్టులు చేయడానికి ల్యాబ్ అసిస్టెంట్ నియామకం, డిజిటల్ ఎక్స్‌రే, మంథని నియోజకవర్గంలో ఐసోలేషన్ వార్డులో ఆక్సీజన్, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌కు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతిపత్రాన్ని పంపించారు. మాతాశిశు సేవలు పునఃప్రారంభమైనందున మంథని నుంచి పెద్దపల్లి, గోదావరిఖనిలో పనిచేస్తున్న 16 మంది స్టాఫ్ నర్సుల డిప్యూటేషన్రద్దు చేయాలని పేర్కొన్నారు. మంథనిలో కొవిడ్ టెస్టులు, కరోనా టీకాలు అందుబాటులో ఉంచాలని కోరారు.
మంత్రి ఈటలకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి - MLA Sridhar Babu's request to Minister etala Rajender
మంత్రి ఈటలకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి పత్రాన్ని పంపారు. మంథనిలోని సమస్యలను వివరిస్తూ... మంత్రి ఈటలకు లేఖను రాశారు.
MLA Sridhar Babu's request