పెద్దపల్లి జిల్లా మంథని శ్రీపాదకాలనీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరిశీలించారు. తాలు పేరుతో నిర్వాహకులు 40 కిలోల బస్తా నుంచి కిలో నుంచి రెండు కిలోల వరకూ ధాన్యం తీసివేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు.
'రైతులకు రాజకీయ రంగు పులమకండి' - grain purchase center in manthani
రైతులకు రాజకీయ రంగు పులమవద్దని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని శ్రీపాదకాలనీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
!['రైతులకు రాజకీయ రంగు పులమకండి' mla sridhar babu visited grain purchase center in manthani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6973846-381-6973846-1588067152966.jpg)
మంథని ధాన్యం కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
స్పందించిన శ్రీధర్ బాబు అధికారులను నిలదీశారు. వెంటనే కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు రాజకీయ రంగు పులమకుండా, అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
Last Updated : Apr 28, 2020, 4:22 PM IST