పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యురాలు శంకరా దేవితో కరోనా వ్యాక్సిన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీధర్ బాబు సమక్షంలో మంథని వైద్యశాల సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో టీకాను ఆకుల శ్రవణ్ (స్వీపర్ )తీసుకున్నారు.
టీకాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: ఎమ్మెల్యే
కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. వ్యాక్సిన్ గురించిన వివరాలను వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. టీకా పై వస్తున్న వదంతులు, అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథనిలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల శ్రీధర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపై పోరాడిన యోధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ టీకాలను వేస్తారని, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని ప్రజల్ని కోరారు. టీకా వేసుకున్నావారు ఏమరపాటు పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. టీకాపై వస్తున్న వదంతులు, అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరి పరిస్థితి విషమం