మంథని నియోజకవర్గంలో కరోనా వ్యాక్సినేషన్, కొవిడ్ టెస్టులు ఒకే చోట కాకుండా.. వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. లేకుంటే కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగి వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని అన్నారు. అధికారులు, వైద్యులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
వ్యాక్సినేషన్ సజావుగా జరిగేలా చూడండి : శ్రీధర్ బాబు - telangana news
18 ఏళ్లు నిండిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరపాలని అధికారులకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు. మంథని నియోజకవర్గంలోని 4 మండలాల్లో కరోనా టీకా పంపిణీపై అధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు.
మంథని ఎమ్మెల్యే, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా వార్తలు
పట్టణంలోని ఆస్పత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని.. కరోనా టెస్టు కిట్లు, వ్యాక్సిన్లు, మందులు, మాస్కులు, గ్లౌసులు, శానిటైజర్లు అన్నీ అందుబాటులో ఉంచాలని సూచించారు. మంథని మాతా శిశు ఆసుపత్రిలోని ఖాళీలు భర్తీ చేయాలని, ఇక్కడ పనిచేసే వారికి డిప్యూటేషన్లు రద్దుచేసి వారిని ఆస్పత్రిలో సేవలు అందించే విధంగా చేయాలని కోరారు.
- ఇదీ చదవండి:ఫేస్బుక్ మొబైల్ యాప్లో టీకా సమాచారం