కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గమని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పోలియో టీకాల మాదిరిగా.. ఇంటింటికీ వెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రవాస భారతీయులు సమకూర్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రారంభించారు. ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. జర్నలిస్టు రఘు అరెస్టును ఖండిస్తున్నామని వెంటనే విడుదల చేయాలన్నారు.
'వ్యాక్సిన్‌తోనే మహమ్మారిని అరికట్టవచ్చు' - అంబులెన్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
పెద్దపల్లి జిల్లా మంథని సామాజిక వైద్యశాలలో ప్రజల కోసం ప్రవాస భారతీయులు సమకూర్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, అంబులెన్సును వైద్య అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రారంభించారు. సీఎస్ఆర్ కింద బోయింగ్ ఇండియా సంస్థ అంబులెన్సును, ప్రవాస భారతీయులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సమకూర్చారు.
పెద్దపల్లి జిల్లా వార్తలు
ప్రజల కోసం రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సమకూర్చిన ప్రవాస భారతీయులు శ్రీనివాస్, ఎం.మోహన్‌ను ఎమ్మెల్యే అభినందించారు. అదేవిధంగా సీఎస్ఆర్ కింద అంబులెన్సును అందించిన బోయింగ్ ఇండియా సంస్థకు అందుకు సాయం చేసిన ఆ సంస్థ సీఎస్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యజ్ఞంబట్ల ప్రవీణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులకు మాస్కులు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్‌లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్