సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు. క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి, పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు - చెక్కులు పంపిణీ
పెద్దపల్లి జిల్లా మంథనిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమావేశం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
సంక్షేమ పథకాలు
రూ. 2 కోట్ల 77 లక్షల విలువచేసే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రూ. 15 లక్షల విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అర్హులకు అందజేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు.. కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.