తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ - Peddapalli District Corona News

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కరోనా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కొవిడ్ బాధితులు ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. లక్షల్లో బిల్లులు చెల్లించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

mla sridhar babu
mla sridhar babu

By

Published : Jun 20, 2021, 7:16 PM IST

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కరోనా బాధిత కుటుంబాలకు, విలేకరులకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నిత్యావసరాలను అందజేశారు. ఆరోగ్య సిబ్బందికి.. మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం ఖమ్మంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి.. కరోనా బాధితులకు అందుతోన్న సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా బాధితులు ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. లక్షల్లో బిల్లులు చెల్లించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో 'జంగిల్‌ బుక్‌' పార్క్​.. ఎక్కడో తెలుసా..!

ABOUT THE AUTHOR

...view details