పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. గ్రామసమీపంలో నిర్మించిన మానేరు వంతెనను పరిశీలించారు. అడవిసోమనపల్లి బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే సర్పంచ్, ప్రజలతో మాట్లాడారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: శ్రీధర్ బాబు - mla sridhar babu visited adavi somanapalli
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు.

అడవిసోమనపల్లిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పర్యటన
వారం రోజులుగా కురుస్తున్న వానలకు తమ గ్రామంలో దాదాపు 60 ఎకరాల వరి పంట దెబ్బతిన్నదని, సుమారు 70 మోటార్లు నీటిలో మునిగిపోయాయని గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు తెలిపారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సర్వే చేయించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. వానకు నేలమట్టమైన ఇండ్ల యజమానులకు పరిహారం ఇవ్వాలని, రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.