మంథని-కాటారం ప్రధాన రహదారిపై వందలాదిగా ఇసుక లారీలు నిలిచిపోయాయి. అదే సమయంలో కాటారం నుంచి మంథని వైపుగా వచ్చిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు... ట్రాఫిక్‌ను నియంత్రించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లో మూల మలుపు సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులకు సమాచారం అందించిన ఎమ్మెల్యే... వెంటనే కారు దిగి వాహనాలను క్రమబద్ధీకరించారు. జాగ్రత్తగా వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఇసుక లారీల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున... అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను శ్రీధర్ బాబు కోరారు.
ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు - ట్రాఫిక్ నియంత్రించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాసేపు ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తారు. మంథని-కాటారం ప్రధాన రహదారిపై భారీగా ఇసుక లారీలు నిలిచిపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే... ట్రాఫిక్ నియంత్రించి, ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు.
భారీగా ట్రాఫిక్ జామ్.. నియంత్రించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు