పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్సాయిపేట అటవి ప్రాంతంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. అన్నారం బ్యారేజీ నుంచి వచ్చే బ్యాక్ వాటర్‌తో మునిగిపోయిన పంటలను సందర్శించారు. పంటలు మునగకుండా గోదావరి నది ప్రక్కన కరకట్ట నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ నుంచి సుందిళ్ల బ్యారేజ్ వరకు సుమారు 15 వందల ఎకరాలు ముంపునకు గురైనట్లు శ్రీధర్ బాబు తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.
'మునిగిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి' - పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్సాయిపేట అటవి ప్రాంతంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. పంటలు మునగకుండా గోదావరి నది ప్రక్కన కరకట్ట నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'మునిగిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి'