రైతులను రాజులుగా మార్చాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోందని పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
'అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయం' - raithu vedhika buldings in ramagundam
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పర్యటించారు. రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
'అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయం'
రైతాంగానికి నూతన వ్యవసాయ విధానం అమలు చేసి ఆర్థికంగా ఎదిగేలా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రైతు వేదికలు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రామగుండం నియోజకవర్గంలో 6 రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.