తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాలుష్య నివారణకు యువత ముందుకు రావాలి' - పెద్దపెల్లి జిల్లా తాజా వార్తలు

ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడాన్ని అలవాటుగా మార్చుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఐఓసీ ఆధ్వర్యంలో కాలుష్య నివారణపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.

mla-korukanti-chander-started-the-bicycle-rally-for-create-awareness-on-pollution-prevention
'కాలుష్య నివారణకు యువత ముందుకు రావాలి' ఎమ్మెల్యే కోరుగంటి చందర్

By

Published : Jan 31, 2021, 5:46 PM IST

రోజురోజుకు పెరుగుతోన్న కాలుష్య నివారణకు యువత ముందుకు రావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాలుష్య నివారణపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతుండడంతో దేశంలో కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కడాన్ని అలవాటుగా మార్చుకోవాలన్న ఆయన చిన్నచిన్న పనులకు కూడా వాహనాలు వినియోగించడాన్ని తగ్గించాలని సూచించారు. సైకిల్‌ను వినియోగించటం వల్ల వ్యాయామంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారని తెలిపారు.

ఇదీ చగవండి:హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కిజోఫ్రీనియా కేసులు

ABOUT THE AUTHOR

...view details