తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోరుకంటి - mla korukanti chander planted saplings at ramagundam

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలికలో నిర్వహించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి యాజమాన్యం విరివిగా మొక్కలు నాటడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

mla korukanti chander  at harithaharam in ramagundam
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోరుకంటి

By

Published : Jul 18, 2020, 1:09 PM IST

రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరిహారం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలికలో నిర్వహించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు.

రాష్ట్రంలో కాలుష్యరహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. వాతావరణ సమతుల్యత కాపాడాల్సిన బాధ్యత.. ప్రతి ఒక్కరిపై ఉందని.. ప్రజలంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరుకంటి చందర్ కోరారు. సింగరేణి యాజమాన్యం పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటడం సంతోషకరమన్నారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details