తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే - MLA Korukanti Chander latest news

పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర వస్తువులతో పాటు రూ.10 వేల చొప్పున పండుగ బోనస్​గా అందించారు.

MLA Korukanti Chander distributed essentials to sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

By

Published : Oct 22, 2020, 5:15 PM IST

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర వస్తువులతో పాటు రూ.10 వేల చొప్పున పండుగ బోనస్​గా అందించారు.

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా బట్టలు, నిత్యావసరాలతో పాటు రూ.10 వేలు అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

లాక్​డౌన్​లో ప్రజలకు ఎంతో ధైర్యాన్ని కల్పించిన పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. వరద బాధితులకు కారెం రవీందర్​ రెడ్డి ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details