తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్​ విద్యావ్యవస్థను దీటుగా ఎదుర్కోవాలి : ఎమ్మెల్యే కోరుకంటి - రామగుండం వార్తలు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వామోదిత పాఠశాల యాజమాన్యాలకు అండగా నిలుస్తామని, కార్పొరేట్​ విద్యా వ్యవస్థను దీటుగా ఎదుర్కోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యాభారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన ట్రస్మా కార్పొరేషన్​ పాఠశాలల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

MLA Korukanti Chandar Participated In School Managment Meeting In Ramagundam
కార్పోరేట్​ విద్యావ్యవస్థను ధీటుగా ఎదుర్కోవాలి : ఎమ్మెల్యే కోరుకంటి చందర్​

By

Published : Jun 30, 2020, 10:48 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఎన్టీపీసీ విద్యాభారతి పాఠశాలలో ట్రస్మా కార్పొరేషన్​ పాఠశాలల సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దిన ప్రభుత్వామోదిత పాఠశాలలకు తమ మద్ధతు ఎల్లవేళలా ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వల్ల ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రజలంతా గుండె నిబ్బరంతో ఉండాలని సూచించారు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. కరోనా సాయంగా ఇచ్చిన రూ.1500 నగదు ఉపాధ్యాయులకు ఆసరాగా నిలిచిందన్నారు. కరోనాతో పాఠశాలలు మూసివేయడంతో ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఆమోదిత పాఠశాలల సంఘం బాధ్యులు రవీందర్ రెడ్డి, యాదగిరిగౌడ్, రాంచంద్రారెడ్డి, అంజిరెడ్డి, సమ్మారావు, సమ్మిరెడ్డి, తిరుపతి, సరోత్తంరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ABOUT THE AUTHOR

...view details