మూడు నెలల క్రితం ఆసుపత్రిలో వదిలేసిన పసిపాప ప్రాణాలను నిలిపి.. ఆ పాప ఆలనాపాలనా చూసి ఆరోగ్యంగా తీర్చిదిద్ది మానవత్వం చాటిన గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆ పసిపాపను జిల్లా ఐసీడీఎస్, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
పాపను వదిలేసిన తల్లిదండ్రులు.. శిశు సంక్షేమ శాఖకు అప్పగింత - mla korukanti chandar handed over to child development
మూడు నెలల క్రితం ఆసుపత్రిలో వదిలేసిన పసిపాపను ఆరోగ్యంగా తీర్చిదిద్ది మానవత్వం చాటిన గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభినందించారు. ప్రభుత్వాసుపత్రిలోని ఆ పాపను జిల్లా ఐసీడీఎస్, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
తల్లిదండ్రులు వదిలేసిన పాపను శిశు సంక్షేమ శాఖకు అప్పగింత
ఆసుపత్రిలో పసిపాపను వదిలేసిన వారు ఈ సమాజంలో ఉన్నా వృథా అని, పసిపాపలను విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే శిశు సంక్షేమశాఖ ద్వారా తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యుటీ మేయర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో గార్డెన్లు ఏర్పాటవ్వాలి : కేసీఆర్