దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సకలవర్గాల సంక్షేమం, పెదోళ్ల కన్నీళ్లు తుడుస్తున్న మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయకాలనీలో రామగుండం మండలంలోని 479 మంది లబ్ధిదారులకు రూ. 4 కోట్ల 76 లక్షల విలువగల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
సీఎంగా కేసీఆర్ ఉండటం ప్రజల అదృష్టం: ఎమ్మెల్యే - ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వార్తలు గోదావరి ఖని
479 మంది లబ్ధిదారులకు రూ. 4 కోట్ల 76 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందజేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ మహానేత కేసీఆర్ సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అభిప్రాయపడ్డారు.
సీఎంగా కేసీఆర్ ఉండటం ప్రజల అదృష్టం: ఎమ్మెల్యే
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ మహనేత కేసీఆర్ సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని కోరుకంటి చందర్ అభిప్రాయపడ్డారు. నేటి సమాజపరిస్థితుల్లో ఆడపడుచుల వివాహాలు చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారిందని.. అందుకే ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే