రాష్ట్రంలో అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగపుత్రుల వ్యాపార అభివృద్ధి కోసం రుణ చెక్కులను అందజేశారు. అన్ని వర్గాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ అందుకు కావాల్సిన వనరులను సమకూరుస్తోందని పేర్కొన్నారు.
'అన్ని వర్గాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ' - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అందుకు సంబంధించిన వనరులను ప్రభుత్వం సమకూరుస్తోందని వెల్లడించారు. రామగుండంలో గంగపుత్రులకు రుణ చెక్కులను ఆయన అందజేశారు.
గంగపుత్రులకు చెక్కులు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. నియోజకవర్గం పరిధిలో ఎంపికైన 5 సొసైటీలకు రూ.3లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:Corona: 'ఒక వేళ మూడో దశ వచ్చినా... ఇంత ప్రభావం ఉండదు'