"పార్టీపై నిందలు వేయడం సమంజసం కాదు"
తెరాసకు రాజీనామా చేసిన సోమారపు సత్యనారాయణ వ్యాఖ్యలపై రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ స్పందించారు. పార్టీలో క్రమశిక్షణ కరువైందనడం బాధాకరమన్నారు.
సత్యనారాయణకు తెరాస మంచి స్థానం కల్పించిందని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. సోమారపు సత్యనారాయణకు రెండుసార్లు పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినా పార్టీలో క్రమశిక్షణ కరువైందని మాట్లాడడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఉన్నతస్థానంలో నిలిపినా పార్టీపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. మాజీ ఎంపీ బాల్క సుమన్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను తనకు ఇవ్వలేదని అబద్ధాలాడటం సరైంది కాదన్నారు.