త్వరలో జరగనున్న పెద్దపల్లి పురపాలక ఎన్నికల్లో ప్రజలంతా తెరాస అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 26, 14, 12 వార్డులతో పాటు పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తెరాస పార్టీకే ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు.
'అభివృద్ధి కావాలంటే తెరాసనే గెలిపించాలి' - 'అభివృద్ధి కావాలంటే తెరాసనే గెలిపించాలి'
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ తెరాసను గెలిపించాలని కోరారు.
'అభివృద్ధి కావాలంటే తెరాసనే గెలిపించాలి'
ప్రజా సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పెద్దపల్లి మరింత అభివృద్ధి చెందాలంటే తెరాస పార్టీకే పట్టం కట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం