తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దాసరి - mla dasari manohar reddy conducted budget meeting in peddapalli district

పెద్దపల్లి పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నూతన పురపాలక చట్టాన్ని పాటిస్తూ జిల్లాకు ఆదాయ వనరులను పెంచాలని అధికారులకు సూచించారు.

mla dasari manohar reddy conducted budget meeting in peddapalli district
బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దాసరి

By

Published : Mar 14, 2020, 7:28 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన పురపాలక చట్టం నిబంధనలను పాలకవర్గ సభ్యులు పాటించి.. పెద్దపల్లి పురపాలిక ఆదాయ వనరులను పెంచాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి కోరారు. పెద్దపల్లి పురపాలిక కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో బడ్జెట్​ సమావేశాన్ని నిర్వహించారు.

నూతన పురపాలక చట్టంలో ఉన్న నియమ నిబంధనలను పాటిస్తే.. పట్టణాన్ని వేగంగా అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం సభ్యులు అక్రమ లేఅవుట్ల నిర్వహణకు అనుమతులు ఇవ్వకూడదని సూచించారు.

బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దాసరి

ఇదీ చూడండి:కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!

ABOUT THE AUTHOR

...view details